ETV Bharat / state

'జర్నలిస్టుల తరుఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు'

జర్నలిస్టుల సంక్షేమ నిధికి.. నిధులు విడుదల చేసినందుకుగాను మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. నిధి రూ. 52 కోట్లకు చేరుకుందని వివరించారు.

press academy chairman allam narayana says Thanks to the govt on behalf of the journalists
'జర్నలిస్టుల తరుఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు'
author img

By

Published : Mar 4, 2021, 8:51 PM IST

జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ. 17 కోట్ల 50 లక్షలను విడుదల చేసినందుకుగాను.. మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయుల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారంటూ.. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నారాయణ. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్​ను కొనియాడారు.

రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్​లో భాగంగా..ఇప్పటికే రూ. 34 కోట్ల 50 లక్షలు మంజూరు కాగా.. మరో రూ. 17 కోట్ల 50 లక్షలు నిధిలో జమ అయ్యాయని నారాయణ తెలిపారు. నిధి రూ. 52 కోట్లకు చేరుకుందని వివరించారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి ​ హామీలు నిలబెట్టుకోలేదు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.