President Draupadi Murmu Visited Hyderabad for Winter Retreat : శీతకాలవిడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దేశాధిపతికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
అనంతరం బేగంపేట విమానశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయానికి ముర్ము పయనమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 23న తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS Shanti kumari) సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి నిలయాన్ని శత్రు దుర్భేధ్యంగా తీర్చిదిద్దారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోని ఆరు భవనాలు, వెలుపల 14 భవనాలను, చుట్టూ ఉన్న ఉద్యానవనాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
President Draupadi Murmu Welcomed by Governor : రాష్ట్రపతి పర్యటన నిమిత్తం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్యం, రోడ్లు భవనాలు, మున్సిపల్, విద్యుత్, సంబంధిత శాఖలు కూడా బ్లూ బుక్ ప్రకారం ఏర్పాటు చేయాలని గతంలోనే సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బొల్లారం నిలయానికి చేరుకోవటం ఇది రెండోసారి. సాధారణంగా శీతాకాలం, వర్షాకాలం విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయితీ. కొన్ని కారణాల దృష్ట్యా దశాబ్దంన్నర నుంచి రాష్ట్రపతులు శీతాకాల విడిది మాత్రమే నిర్వహిస్తున్నారు. మధ్యలో ఒకసారి ప్రణబ్ ముఖర్జీ(Former President Pranab Mukherjee) వర్షాకాల విడిది చేశారు. గత ఏడాది తొలిసారి శీతాకాలం విడిది కోసం వచ్చిన ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి నిలయాన్ని సామాన్యులందరూ అన్ని రోజులు సందర్శించేలా అవకాశం కల్పించారు.
President Came to State for Winter Vacation : రాష్ట్రపతి బసచేసే సమయంలో తప్ప మిగతా రోజుల్లో ఈ చారిత్రక భవనాన్ని సందర్శించే సువర్ణ అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. దేశాధినేత రాక సందర్భంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చే సంప్రదాయం కూడా ఎప్పటినుంచో కొనసాగుతుంది. గత సంవత్సరం కూడా ఈ వేడుకను రాజ్‌భవన్‌లో నిర్వహించారు.
ఈ నెల 18కి హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అధికారుల కాన్వాయ్ రిహార్సల్
బైడెన్ కాన్వాయ్‌ను ఢీకొన్న కారు- సెక్యూరిటీ అలర్ట్- అసలేం జరిగింది?