ETV Bharat / state

కిడ్నాప్ కేసు : నిందితుల కోసం పోలీసుల వేట

ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అపహరణ కేసులో నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఏ2గా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ1 నిందితురాలిగా మార్చారు.

praveen rao Brothers kidnapping case police blown up in telangana
'ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్​.. పోలీసుల గాలింపు'
author img

By

Published : Jan 7, 2021, 7:51 PM IST

జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాయలసీమకు చెందిన శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను ముఠా ఈ అపహరణకు పాల్పడినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు... వారిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

ఖాకీ దుస్తులు

ఆదాయపన్ను అధికారులుగా అవతారమెత్తిన కిడ్నాపర్లు... వాటికి కావాల్సిన దుస్తులను ఫిలింనగర్​లోని ఓ డ్రామా డ్రెస్ కంపెనీలో అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో ఓ వ్యక్తి ఖాకీ దుస్తులు ధరించాడు. ఈ మేరకు డ్రామా డ్రెస్ కంపెనీలో సీసీ దృశ్యాలను కూడా సేకరించారు. ఐటీ అధికారులమని నమ్మించి ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడిన గుంటూరు శ్రీను ముఠా... తెలివిగా ముగ్గురిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మూడు వాహనాలు

ముగ్గురు సోదరులను మొదట విచారణ పేరుతో వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వాహనాల్లో ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పుతూ చివరికి మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్​కు తీసుకెళ్లారు. అక్కడ కొన్ని దస్త్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారు.

కిడ్నాపర్లు వెనకడుగు

ప్రవీణ్ రావు సోదరుల అపహరణకు కుటుంబ సభ్యులు అఖిలప్రియ దంపతులపైనే అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు కూకట్​పల్లిలోని ఆమె ఇంటికి చేరుకుని గృహ నిర్బంధం చేశారు. అపహరణ వార్త టీవీల్లో ప్రముఖంగా ప్రసారం కావడం, అఖిలప్రియ దంపతుల ప్రమేయం రూడీ కావడం వల్ల కిడ్నాపర్లు కాస్త వెనకడుగు వేశారు.

పోలీసుల గాలింపు

ప్రవీణ్ కుటుంబ సభ్యుల వద్ద ఉన్న ఓ పోలీస్ అధికారికి కిడ్నాపర్లు చివరికి ఫోన్ చేసి ముగ్గురు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వాళ్లను వదిలేస్తున్నట్లు కూడా పోలీస్ అధికారికి కిడ్నాపర్లు చెప్పారు. మెయినాబాద్ పామ్​హాస్​ సమీపంలో కిడ్నాపర్లు ముగ్గురిని వదిలి.. వికారాబాద్ వైపు పారిపోయారు. ఆ తర్వాత ప్రవీణ్ రావు సోదరులు కారు అద్దెకు తీసుకుని నార్సింగి వరకు వచ్చారు. అక్కడికి బోయిన్ పల్లి పోలీసులు చేరుకుని ముగ్గురిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చారు. పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్​తోపాటు.. కిడ్నాపర్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి : అఖిలప్రియతో ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు : ప్రతాప్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.