ETV Bharat / state

గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

group-4
group-4
author img

By

Published : Dec 23, 2022, 9:10 AM IST

Updated : Dec 23, 2022, 9:33 AM IST

09:08 December 23

గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

Group-4 Applications: నేటి నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్టు టీఎస్​పీఎస్​సీ వెల్లడించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు గ్రూప్-4 దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కమిషన్‌ తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు మూడు వారాల గడువు ఇచ్చింది.

పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 1,862 వార్డు అధికారుల పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. వీటిలో సీసీఎల్‌ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, జూనియర్‌ అకౌంటెంట్‌ 429, జూనియర్‌ ఆడిటర్‌ 18, వార్డు అధికారుల పోస్టులు 1,862 భర్తీ కానున్నాయి.

భారీ సంఖ్యలో దరఖాస్తుల అంచనా.. గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో కనీసం 6-7 లక్షల మధ్యలో రావొచ్చని భావిస్తోంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్‌ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్‌-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రస్తుతం ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 23, 2022, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.