హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల్ బస్తీ విజయమేరీ ఆసుపత్రిలో ఓ బాలింత మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి వరకు ఆర్యోగ్యంగా ఉన్న తల్లి హఠాత్తుగా మృతి చెందటం వల్ల... ఆసుపత్రి ముందు బంధువులు ధర్నా నిర్వహించారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పుట్టిన బిడ్డ క్షేమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.