పార్టీ మారుతున్న ఈటల రాజేందర్ నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని... పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్(ponnam prabhakar) అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా... నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారు రాజీనామా చేయకున్నా సీఎం కేసీఆర్(CM KCR) వారితో రాజీనామా చేయించి... నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని పొన్నం కోరారు.
ఇదీ చూడండి: Niranjan Reddy: 'నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'