ETV Bharat / state

Pollution Control Board Distribute Clay Ganesh Idols : హైదరాబాద్​లో 2 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ.. ఏర్పాట్లు చేస్తున్న పీసీబీ - ganesh chaturthi 2023

PCB Distribute Clay Ganesh Idols in Hyderabad : వినాయక చవితి నేపథ్యంలో.. ఉచిత మట్టి విగ్రహాల పంపిణీపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి దృష్టి సారించింది. హైదరాబాద్​లో సుమారు రెండు లక్షల విగ్రహాలను పంపణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Pollution Control Board
Vinayaka Chavithi 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2023, 4:47 PM IST

Pollution Control Board to Distribute Clay Ganesh Idols in Hyderabad : వినాయక చవితి వేడుకలకు సమయం దగ్గరవుతోంది. గత ఏడాది కంటే ఈసారి మట్టి విగ్రహాల వినియోగం పెంచేందుకు కాలుష్య నియంత్రణ మండలి ( Pollution Control Board ) చర్యలు చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేలా ఈసారి కూడా పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలు పంపిణీ చేయాలని పీసీబీ నిర్ణయించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి పలికేలా హైదరాబాద్​లో సుమారు రెండు లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పీసీబీ అధికారి కృష్ణ ఆదిత్య వివరించారు.

Ganesh Chaturthi 2023 : హైదరాబాద్​లోని ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన పెరిగిందని పీసీబీ తెలిపింది. ఈ క్రమంలోనే నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు.. కాలుష్యం నియంత్రణ మండలి ఆధ్వర్యంలో.. మట్టి వినాయకులను (Clay Ganesh Idols) సిద్ధం చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని కృష్ణ ఆదిత్య తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.

మక్తాల ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

Khairatabad Ganesh Height 2023 : మరోవైపు ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహం.. ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా రూపుదిద్దుకుంటున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. పర్యావరణ హితం కోసం మట్టి గణపతినే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఖైరతాబాద్​లో గణేశుని ఉత్సవాలు ప్రారంభమై ఈ ఏడాదితో 69 సంవత్సరాలు అవుతోంది. ఏటా సిద్ధాంతి విఠలశర్మ సూచనతో నమూనా సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారమే ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా విఠలశర్మ సూచనల ప్రకారం నామకరణం చేశారు.

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉండనుంది. నిల్చున్న తీరులో 'శ్రీ దశమహా విద్యాగణపతి' విగ్రహం ఉండగా.. తలపై ఏడు సర్పాలతో స్వామి వారు దర్శనమివ్వనున్నారు. మరోవైపు వెనుక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులతో.. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, వరి ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలతో పాటు మూషికం కూడా ఉండనుంది.

మట్టి గణపయ్యా... నీకు దండాలయ్యా...

ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాన మండపం రెండు వైపులా ఏర్పాటు చేసి.. ఇతర విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహాస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకుంటున్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి వేడుకలు ప్రారంభం కాగా.. 28 వరకు నిర్వహిస్తారు. విగ్రహం తయారీ పనులు 50 శాతానికి పైగా పూర్తయినట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వినాయక చవితికి మూడు రోజుల ముందుగానే భక్తులు వీక్షించేందుకు అందుబాటులోకి తేనునట్లు వారు పేర్కొన్నారు.

ఖైరతాబాద్​కు పోటెత్తిన భక్తులు.. ఎక్కడికక్కడే స్తంభించిన ట్రాఫిక్‌

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశుడు.. గవర్నర్‌ తమిళిసై తొలిపూజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.