నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నికలో గెలిచిన కల్వకుంట్ల కవితను పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాల్లో కవిత పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ విజయం నిదర్శనమని నేతలు అభినందనలతో ముంచెత్తారు. శాసన వ్యవహారాలతో పాటు.. పార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆమెను నేతలు కోరారు.
మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్లు గొంగిడి సునీత, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కె.విద్యా సాగర్ రావు, వనమా వెంకటేశ్వరరావు, అబ్రహం, కృష్ణ మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీలు కె.జనార్దన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పీఆర్టీయూ నేత పూల రవీందర్, టీబీజీకేఏ నేత రాజిరెడ్డి తదితరులు కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం