హైదరాబాద్ వారాసిగూడకు చెందిన ఆనంద్, నవీనలు దంపతులు. నవీనకు పురుటినొప్పులు రాగా ఆమె భర్త 100 నంబర్‌కి ఫోన్ చేశాడు. తక్షణమే స్పందించిన పెట్రోలింగ్ సిబ్బంది సతీశ్, కానిస్టేబుళ్లు ప్రకాష్, సాయిలింగ, మజార్‌లు వెంటనే వారి ఇంటికి చేరుకుని ఆమెను పెట్రోలింగ్ కారులో ఆస్పత్రికి తరలించారు. తొలుత 108 సిబ్బందిని సంప్రదించినప్పటికీ... వారు రాలేదని ఆనంద్ తెలిపారు. పోలీసులకు సమాచారమిస్తే వారు వచ్చి తన భార్యను కోఠిలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు