ETV Bharat / state

పాతబస్తీపై యూపీ కాల్పుల ప్రభావం.. భద్రత కట్టుదిట్టం.. - తెలంగాణ తాజా వార్తలు

Heavy police bandobast at old city: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు.

Heavy police bandobast at old city, Asaduddin Owaisi vehicle attack
పాతబస్తీలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచిన పోలీసులు
author img

By

Published : Feb 4, 2022, 12:20 PM IST

Updated : Feb 4, 2022, 3:05 PM IST

Heavy police bandobast at old city : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో..... హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా చార్మినార్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టియర్ గ్యాస్​తో పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న అసద్‌ కారుపై.... ఇద్దరు దుండగులు గురువారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Asaduddin Owaisi vehicle attack : ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గొడవలు తలెత్తే అవకాశం ఉన్నందున... పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచారు. చార్మినార్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల పహారా పెంచారు. చార్మినార్, లాడ్ బజార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ దుకాణాలు తెరుచుకోలేదు.

పాతబస్తీపై యూపీ కాల్పుల ప్రభావం.. భద్రత కట్టుదిట్టం..

ప్రార్థనల తర్వాత నినాదాలు

హైదరాబాద్‌ మక్కా మసీదులో ప్రార్థనల తర్వాత ముస్లింలు నినాదాలు చేశారు. యూపీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి భద్రత పెంచాలని కోరారు.

ఇదీ చదవండి: అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!

Last Updated : Feb 4, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.