శంషాబాద్ నుంచి కాలినడకన సొంతూళ్లకు వెళ్తున్న జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన దాదాపు వేయి మంది వలస కార్మికులను బహదూర్‌పురా, జూ పార్క్ వద్ద... హైదరాబాద్ కాలాపత్తర్, బహదూర్ పుర పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తిలు తమ సిబ్బంది తో బహదూర్‌పురా చేరుకున్నారు. వలస కార్మికులకు నచ్చ జెప్పి బస్సులను ఏర్పాటు చేసి తిరిగి వారిని శంషాబాద్‌కు తరలించారు.
తమకు జీతాలివ్వడం లేదని... తమ వద్ద ఉన్న డబ్బులు సైతం అయిపోయాయని వలస కార్మికులు తెలిపారు. కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని... సరైన సమయానికి తమకు భోజనం కరువైందన్నారు. పోలీసులు పలు మార్లు తమ వివరాలు సేకరించినప్పటికీ... తమను స్వస్థలాలకు పంపించకపోవడం వల్లే తాము రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్‌డౌన్‌పై మంగళవారం మంత్రివర్గ భేటీ