ETV Bharat / state

కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్​పై పోలీసుల దాడి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 31 వరకు లాక్​డౌన్​ విధించారు. ఈ సందర్భంగా ప్రజలు బయట తిరగకూడదని ఆంక్షలు విధించారు. మీడియా, వైద్యం, నిత్యవసర దుకాణాలు, పోలీసులకు మినహాయింపు ఇచ్చారు. కానీ బయటకు వచ్చిన మీడియా సిబ్బందిపై పోలీసులు విరుచుకుపడ్డారు. రిపోర్టర్​ అని చెప్పినా వినకుండా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్​ నడిబొడ్డులో జరిగింది.

police attack on a reporter came for coverage at chandrayangutta
కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్​పై పోలీసుల దాడి
author img

By

Published : Mar 24, 2020, 5:48 AM IST

Updated : Mar 24, 2020, 7:16 AM IST

ఓ విలేకరిపై దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై జరిగింది. చంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా నేపథ్యంలో లాక్​డౌన్ ప్రస్తుత పరిస్థితులపై కవరేజ్ కోసం రిపోర్టర్ సలీం వెళ్లారు.

అది గమనించిన టాస్క్​ఫోర్స్ పోలీసులు చితకబాదారు.​ రిపోర్టర్​ అని చెప్పిన తర్వాత కూడా దాడి చేశారని సలీం కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడుము, భుజంపై గాయాలయ్యాయి.

కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్​పై పోలీసుల దాడి

ఇదీ చూడండి : 'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్​కు కాల్​ చేయండి'

Last Updated : Mar 24, 2020, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.