ETV Bharat / state

పుట్టిన రోజు నాడు కంటతడి పెట్టిన పోచారం - పోచారం శ్రీనివాస్​రెడ్డి

Pocharam shed tears on the assembly premises: పుట్టిన రోజు నాడు తన స్నేహితుడు చనిపోయాడన్న వార్త విని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టారు. దీంతో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేద్దాం అనుకున్న కార్యకర్తలకు జరపవద్దని చెప్పారు. మిత్రుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Pocharam shed tears on the assembly premises
పుట్టిన రోజు నాడు కంటతడి పెట్టిన పోచారం
author img

By

Published : Feb 10, 2023, 1:18 PM IST

Pocharam shed tears on the assembly premises: అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టారు. ఈ రోజు పోచారం పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీలో పోచారం మొక్కను నాటారు. అదే సమయంలో తమ చిన్న నాటి స్నేహితుడు మృతి చెందినట్టు తెలియంటంతో ఒక్కసారిగా పోచారం కంటతడి పెట్టారు. స్నేహితుడి మృతి నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నట్టు ఆయన ప్రకటించారు. సొంత నియోజక వర్గంలో పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. మిత్రుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాప్టర్​లో వెళ్లనున్నారు.

పుట్టిన రోజు నాడు కంటతడి పెట్టిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

"అసెంబ్లీ ఆవరణంలో జన్మదిన వేడుకలు నాకు తెలియకుండా ఏర్పాట్లు చేశారు. అందువల్ల కాదనలేకపోయాను. నా నియోజక వర్గంలో ఇతర ప్రాంతాల్లో జరిపిద్దాం అనుకొన్న వేడుకలను రద్దీ చేయమని చేబుతున్నా. నా అత్యంత సన్నిహితుడు చనిపోయాడు. అందువల్ల ఎటువంటి వేడుకలు చేయవద్దు. నా స్నేహితుడికి నాకు 50 సంవత్సరాల అనుబంధం ఉంది. శాసన సభా సమావేశాలు జరిగిన తరువాత నేను అక్కడికి చేరుకుంటాను. నా స్నేహితుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను." -పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.