రేపు రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఇందిరాపార్కు నుంచి నెక్లెస్ రోడ్ వరకు పరేడ్‌కు అనుమతినివ్వాలని వ్యాజ్యంలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుసంఘం కార్యదర్శి పశ్య పద్మ పిల్ దాఖలు చేశారు.
దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా పరేడ్ చేస్తామని ఆమె వెల్లడించారు. అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరారు. మధ్యాహ్నం తర్వాత విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.
- ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం