మృగశిర కార్తె సందర్భంగా కూకట్పల్లిలోని చేపల మార్కెట్ వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం నుంచి చేపలు కొనేందుకు భారీగా తరలివస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీలోని చేపల మార్కెట్ వద్ద కొద్దిగా రద్దీ తక్కువగా కనిపించినప్పటికీ... నిజాంపేట్ రోడ్లోని చేపల మార్కెట్ వద్ద భారీగా రద్దీ కనిపించింది. నిజాంపేటలో ప్రజలు మాస్కులు, భౌతిక దూరం పాటించకుండానే రోడ్లపై తిరుగుతున్నారు.
మామూలు సమయంలో భౌతిక దూరం పాటిస్తున్న ప్రజలు మాంసం, నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయంలో మాత్రం నిబంధనలు విస్మరిస్తున్నారు. దీంతో మార్కెట్లు కరోనా వ్యాప్తికి ఊతం ఇస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యమైన పండుగలు వారంతాల సమయంలో మార్కెట్ల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేస్తేనే ప్రజలు నిబంధనలు పాటిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!