ETV Bharat / state

ఎండ లెక్కలేదు.. ఎడం అక్కర్లేదు! - wines shops open in telangana news

ఓవైపు ఎండలు మండిపోతున్నా లెక్కచేయలేదు.. ఎడం పాటించాలన్న ప్రభుత్వ ఆంక్షలనూ పట్టించుకోలేదు.. చాలామంది కనీసం మాస్కులూ ధరించకపోవడం గమనార్హం. నగరంలో మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించడంతో బుధవారం మందుబాబులు పెద్దఎత్తున రోడ్డెక్కారు.

Hyderabad latest news
Hyderabad latest news
author img

By

Published : May 7, 2020, 8:10 AM IST

రాష్ట్రంలో దాదాపు 45 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరవడం వల్ల ఉదయం నుంచే మందుబాబులు షాపుల ముందు బారులు తీరారు. ఉదయం పదిగంటలకు దుకాణాలు తెరుస్తారని తెలిసి తెల్లవారుజామున 4 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో దుకాణం ముందు కిలోమీటర్ల మేర బారులు తీరారు.

జనం ఎడం పాటించేలా మద్యం దుకాణాల నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో లాక్‌డౌన్‌ ఆంక్షలకు పూర్తిగా నీళ్లొదిలారు మద్యం ప్రియులు. అన్ని దుకాణాల ముందు పోలీసులు పహారా కాసినా కొన్నిచోట్ల గొడవలు తప్పలేదు. ఉదయం నుంచే మందు కొనుక్కునేందుకు వేచి చూసి తీరా చేతికి సీసాలు దొరగ్గానే అక్కడే తాగేసి చిందులేశారు. నగర పరిధిలో 178 దుకాణాలు తెరుచుకున్నాయని కంటెయిన్‌మెంట్‌ జోన్లలో దుకాణాలకు అనుమతివ్వలేదని సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

దొరికిందే అదనుగా పెంచేశారు...
అమ్మకాల ప్రారంభానికి అనుమతులతోపాటు మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలాగైనా కొంటారనే భావనతో కొందరు వ్యాపారులు అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు. ప్రతి బీరుపై రూ.30 పెంచాలని ఆదేశాలుండగా కొన్ని ప్రాంతాల్లో దీన్ని రూ.50 పెంచారని మద్యం ప్రియులు చెబుతున్నారు.

చీప్‌ లిక్కర్‌ ఫుల్‌బాటిల్‌పై ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువే వసూలు చేశారు. కొన్ని దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అమ్మకాలు కొనసాగాయి. ఓవైపు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే మరోవైపు మద్యం దుకాణాలకు అనుమతులివ్వడంపై నగర జనం మండిపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.