ETV Bharat / state

Pending Bills Issue in Telangana : మళ్లీ రాజ్‌భవన్‌ చేరిన బిల్లుల కథ.. ఈసారి గవర్నర్ నిర్ణయమేంటో..? - తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం

Pending Bills Issue in Telangana : బిల్లుల కథ మళ్లీ రాజ్‌భవన్‌కు చేరింది. ఉభయ సభలు ఇటీవల ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అందులో వెనక్కి పంపిన నాలుగింటితో పాటు ఎనిమిది కొత్తవి కలిపి మొత్తం 12 బిల్లులు ఉన్నాయి. బిల్లుల విషయంలో గతంలో అభ్యంతరాలు తెలిపిన గవర్నర్... ఈ మారు ఎలాంటి వైఖరి కనబరుస్తారోననే ఆసక్తి నెలకొంది.

Governor Telangana Govt Controversy
Telangana 12 Bills for Raj Bhavan
author img

By

Published : Aug 12, 2023, 7:17 AM IST

Updated : Aug 12, 2023, 7:57 AM IST

Pending Bills Issue in Telangana మళ్లీ రాజ్‌భవన్‌ చేరిన బిల్లుల కథ.. ఈసారి గవర్నర్ నిర్ణయమేంటో

Pending Bills Issue in Telangana : రాష్ట్రంలో బిల్లుల అంశం ఆసక్తికరంగా మారింది. శాసనసభ, శాసనమండలి గతంలో ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేయలేదు. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపి.. నాలుగింటిని వెనక్కి పంపారు. దీంతో ఇటీవల జరిగిన శాసనసభ, మండలి సమావేశాల్లో (Telangana Assembly Sessions 2023) ఆ నాలుగు బిల్లులను పునఃపరిశీలనకు చేపట్టి మళ్లీ యథాతథంగా ఆమోదించారు. పురపాలక నిబంధనలు, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, డీఎంఈ వయోపరిమితి పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లులు అందులో ఉన్నాయి. రెండో మారు ఆమోదిస్తే గవర్నర్ ఆమోదముద్ర వేయక తప్పదని మంత్రులు తెలిపారు.

12 Bills Pending at Governor Tamilisai : మళ్లీ ఆమోదం తెలిపిన నాలుగు బిల్లులతో పాటు మరో ఎనిమిది బిల్లులను కూడా ఇటీవలి సమావేశాల్లో ఆమోదించారు. కీలకమైన ఆర్టీసీ ఉద్యోగుల బిల్లుతో పాటు టిమ్స్ ఆసుపత్రుల బిల్లు, పురపాలక చట్ట సవరణ బిల్లు, రెండు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు (Panchayati Raj Act Amendment Bill), కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లులు కూడా ఉభయ సభల ఆమోదం పొందాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును (TSRTC Bill) అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకే గవర్నర్ తమిళిసై మొదట సమ్మతి తెలపలేదు.

Governor Tamilisai on pending bills : 'బిల్లులను తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు.. ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పాను'

Telangana Pending Bills with Governor Tamilisai : రెండు దఫాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణలు కోరి... ఆ తర్వాత అధికారులని పిలిపించుకొని మాట్లాడిన తర్వాతే అనుమతించారు. అది కూడా పది సిఫారసులతో సమ్మతి తెలిపారు. ఆ తర్వాతే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఉభయసభల్లో అదే రోజు ఆమోదముద్ర పడేలా చేసింది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన మొత్తం 12 బిల్లులను అధికారులు నిర్ణీత నమూనాలో రాజ్ భవన్‌కు పంపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.

Governor Tamilisai on private universities bill : 'విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే బిల్లులు తిరస్కరించా'

Governor Tamilisai Telangana Govt Controversy : గతంలో వెనక్కి పంపిన నాలుగు బిల్లులతో పాటు కొత్త బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి వైఖరి అనుసరిస్తారన్న అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను నామినేట్ చేయడానికి సంబంధించిన దస్త్రాలు కూడా ఇప్పటికే రాజ్ భవన్‌కు పంపారు. దీంతో మరోసారి గవర్నర్‌ అంశం తెర మీదకు వచ్చింది. ఈ సారైనా బిల్లులకు రాజ్‌భవన్‌ నుంచి ఆమోదం లభిస్తుందా.. లేదా అనేది వేచి చూడాలి.

Governor Tamilisai on TSRTC Bill : 'RTC సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛను ఇస్తారా..?'

TSRTC Workers Protest at Raj Bhavan : 'గవర్నర్ సానుకూలంగా ఉన్నారు.. బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నాం'

Telangana Assembly Passes Rejected Bills : బిల్లుల పునఃఆమోదం.. గవర్నర్​ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రుల ఆక్షేపణ

Last Updated : Aug 12, 2023, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.