ETV Bharat / state

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏడాది జైల్లోనే.. ఉత్తర్వులు జారీ!

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌ విన్న న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు సూచించగా.. పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసి అందులో గతంలో రాజాసింగ్‌ వ్యాఖ్యలు జతచేసి న్యాయస్థానం ముందు ఉంచారు.

MLA Rajasingh
MLA Rajasingh
author img

By

Published : Oct 28, 2022, 5:33 PM IST

Updated : Oct 29, 2022, 9:27 AM IST

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీ చట్టం కింద నిర్బంధించడాన్ని సలహా మండలి ఆమోదించిందని, దీంతో 12 నెలల పాటు నిర్బంధిస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీచేశామని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. ఆగస్టు 25న రాజాసింగ్‌ను పీడీ చట్టం కింద అరెస్టు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన భార్య ఉషాభాయ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

దీనిపై జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ జె.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్‌కుమార్‌ సదాశివుని వాదనలు వినిపించారు. రాజాసింగ్‌ కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా టీవీల్లో ప్రసంగించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని పీడీ చట్టం కింద నిర్బంధించామని, దాన్ని సలహా మండలి ఆమోదించిందని కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 19న తాజాగా జీవో జారీ చేసిందని చెప్పారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేశారా? అని ప్రశ్నించింది. సవరణ పిటిషన్‌ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 29, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.