లాక్‌డౌన్ మళ్లీ విధించినట్లయితే.. ముందుగానే పేదల ఖాతాల్లో పదివేలు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ అంటున్నారు.. అలాగే కరోనా విజృంభణలో కూడా తెలంగాణ నంబర్ వన్ అయిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చూసి సీఎం కేసీఆర్ నేర్చుకోవాలన్నారు.
కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని మల్లు రవి డిమాండ్ చేశారు. వైద్యం అందుతున్న తీరుపై ఒక పేషంట్ వీడియో ద్వారా తెలియజేశారని.. తగిన సిబ్బంది లేకనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. ఊపిరి ఆడటంలేదని సెల్ఫీ వీడియో తీసి పంపిన రవి మృతికి నైతిక బాధ్యత వహించి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్న.. వైద్యం కోసం ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం