నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని కరోనా బాధితులు సుమారు 1000మందికి నిత్యావసర వస్తువులు, కరోనా కిట్ల పంపిణీకి జెండా ఊపి ప్రారంభించారు.
రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలే.. దేశాభివృద్ధికి తోడ్పడ్డాయని పేర్కొన్నారు. భారతదేశంలో టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికిన వ్యక్తి.. రాజీవ్‌గాంధీ అని కొనియాడారు. గ్రామస్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాంగాన్ని సవరించిన వ్యక్తి అని కితాబిచ్చారు. దేశంలో కరోనా విలయతాండవానికి మోదీ, ఇక్కడ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. వారి ముందుచూపు లేకపోవడం వల్లే కరోనా బాధితులకు ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అటకెక్కిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ కరోనాకు ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : మధ్యాహ్నం 3 గంటల నుంచి వెబ్సైట్లో 'పది' ఫలితాలు