74వ స్వాతంత్య్ర వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ పార్టీ ముఖ్య నేతలు షేక్ రియాజ్, వై.నగేష్, అధ్యక్షుల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గల్వాన్ లోయ యోధులకు శౌర్య పతకం!