రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా 14 తపాలా కార్యాలయాల ద్వారా ఇస్తున్న పాస్‌పోర్టు సేవలు రేపటి నుంచి నిలిపివేస్తున్నట్లు.. సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. మే 14 వరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్, కామారెడ్డి, వికారాబాద్, వనపర్తి, మేడ్చల్ తపాలా కార్యాలయాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. భవిష్యత్తులో వీటిని పునరుద్ధరించే ముందు తపాలా శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం నిధులు విడుదల