లాక్‌డౌన్ ఎత్తివేయడంతో రాష్ట్రంలోని 14తపాలా కార్యాలయాల ద్వారా పాస్‌పోర్టు సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్‌కు ముందు అందుబాటులో ఉన్న సేవలన్నీ ప్రస్తుతం కొనసాగుతాయని తపాలాశాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ వెల్లడించారు. ఈ నెల పది నుంచి పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ... ఇప్పటినుంచి అన్ని రకాల సేవలు సాధారణ రోజుల్లాగే కొనసాగుతాయని ఆయన వివరించారు.
అన్ని రకాల సేవలు
హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, మేడ్చల్, వనపర్తి, భువనగిరి, మహబూబాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర 14 ప్రధాన తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టులకు చెందిన అన్ని రకాల సేవలు అందుతాయని పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదిలో ఈ 14 తపాలా కార్యాలయాల నుంచి 41,921 మందికి చెంది వివిధ రకాల సేవలు అందించినట్లు ఆయన వెల్లడించారు.
కొవిడ్ నిబంధనలకు లోబడి..
విద్యార్ధులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారు సమయం, డబ్బు వృథా కాకుండా పత్రాల పరిశీలన జరుగుతోందని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చునని తెలిపారు. తపాలా కార్యాలయాలకు అన్ని పత్రాలు తీసుకొచ్చినట్లయితే కొవిడ్ నిబంధనలకు లోబడి పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
పూర్తి స్థాయిలో సేవలు
లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌక్, నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాలు పని చేస్తున్నాయి. తొలుత యాభైశాతం అపాయింట్‌మెంట్లు మాత్రమే ఇచ్చేవి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, వికారాబాద్, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డిలోని సేవాకేంద్రాల్లో ఈ నెల 10 నుంచి సేవలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇదీ చదవండి: offline classes: ప్రత్యక్ష తరగతులు వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం