కుల, మతాలకు అతీతంగా సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన వీర సైనికులకు శ్రద్ధాంజలి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, రాంచందర్‌రావు, కృష్ణదాస్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
