ETV Bharat / state

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా

శాసనమండలి సభ్యుడు, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్​రెడ్డి రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

రైసస అధ్యక్షుడిగా పల్లా
author img

By

Published : Nov 16, 2019, 2:16 PM IST

రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడు, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్​రెడ్డిని నియమించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం... వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను వచ్చే జూన్ వరకు బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు.

క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా రైతు సమన్వయ సమితులను పటిష్ఠమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలన్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై మూడు, నాలుగు రోజుల్లో వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

ఇవీ చూడండి : బస్‌ రోకోకు అనుమతి లేదు: సీపీ

File : TG_Hyd_26_16_Palla_Rajeswar_Reddy_Dry_3053262 From : Raghu vardhan ( ) రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యులు, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం... వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను వచ్చే జూన్ వరకు బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలన్న భావనతో ముఖ్యమంత్రి ఉన్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై మూడు, నాలుగు రోజుల్లో వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.