ఏపీకి చెందిన వరిధాన్యం లారీలను.. రాష్ట్రంలోకి రానీయకుండా పుల్లూరు టోల్‌ప్లాజా (PULLURU TOLL GATE) వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తెలంగాణ సరిహద్దు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యానికి తెలంగాణలోకి అనుమతి లేదంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీకి చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా నడిరోడ్డుపై లారీలను ఆపడం సరికాదని వాపోయారు. పోలీసుల అడ్డగింతతో టోల్గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: జగిత్యాలలో కదం తొక్కిన రైతులు.. ధాన్యం కొనుగోలుకు డిమాండ్