యూనివర్సిటీలపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో పరిశోధక విద్యార్థి నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చనగాని దయాకర్ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణలోని ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు పర్మినెంట్గా వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు.
వందేళ్ల ఓయూ భూములను పరిరక్షించాలని, ఓయూ భూములపై కన్నేసిన కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దయాకర్ అన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇవీ చూడండి: జగన్ జల దోపిడీకి కేసీఆర్ అండ: రేవంత్రెడ్డి