ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతలపై భిన్న వాదనలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఆస్పత్రికి కొత్త భవనాల నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. భవనాన్ని కూల్చివేయాలని ఓ వాదన.. పురాతన భవనమని మరో వాదన ఉందని ధర్మాసనం పేర్కొంది. ఆస్పత్రి పురావస్తు భవనమా..? కాదా? చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఉస్మానియా మరమ్మతుల కోసం గతంలోనే 6కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం తెలిపింది. మరమ్మతు పనుల పురోగతి తెలుసుకొని చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు అనుమతి కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.