ETV Bharat / state

పేదలకు బత్తాయి పండ్ల పంపిణీ - lockdown

హైదరాబాద్​ నల్లకుంట డివిజన్​లోని తిలక్​నగర్​లో పేదలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.

oranges distribution in hyderabad
పేదలకు బత్తాయి పండ్ల పంపిణీ
author img

By

Published : May 15, 2020, 8:47 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి 'సి విటమిన్' పుష్కలంగా లభించే బత్తాయి పండ్లను తినాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ అన్నారు. బత్తాయి రైతులను ఆదుకోవాలనే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు హైదరాబాద్​ నల్లకుంట డివిజన్ తిలక్ నగర్​లో తెరాస పార్టీ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పేదలకు ఎర్రోళ్ల శ్రీనివాస్ బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. 500 కుటుంబాలకు బత్తాయి పండ్లను ఎర్రోళ్ల శ్రీనివాస్ తన చేతుల మీదుగా అందజేశారు.

ప్రతి కుటుంబం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, బత్తాయి రైతులను ఆదుకోవాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: అనాథ యువతికి పెళ్లి చేసిన స్నేహితులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.