Opposition parties Campaign in Telangana 2023 : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకుండా తిరుగుబాటు దారులను బుజ్జగింపులు సహా, నేతలు ఐకమత్యంగా పనిచేస్తున్నారు. ఆరు గ్యారంటీలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లేలా హస్తం పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతున్నారు. మరో వైపు బీజేపీ సైతం ప్రచారబరిలో జోరు పెంచింది.
Congress Election Campaign in Telangana 2023 : తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహింస్తోంది. ఆరు గ్యారంటీలకు మంచి స్పందన రావటం హస్తం నేతలకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండలంలో అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు గడప, గడపకూ తిరిగారు. బాన్సువాడలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకున్న కాసుల బాలరాజు.. ఏనుగు రవీందర్ రెడ్డికి మద్దతు పలికారు.
కాంగ్రెస్ అగ్రనేతలతో సుడిగాలి ప్రచారాలకు ప్లాన్, ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ
Congress Six Guarantees in Telangana 2023 : ఆర్మూర్ అభ్యర్థి వినయ్ రెడ్డి నందిపేట్ మండలంలో ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారెంటీలను వివరించారు. జుక్కల్ అభ్యర్థి తోట లక్ష్మీ కాంతారావును డోంగ్లీ మండల కార్యకర్తలు గుర్రంపై సమీపంలో దర్గాకు తీసుకెళ్లారు. నిజామాబాద్‌లో షబ్బీర్ అలీ కార్నర్ సమావేశం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి మేడిపల్లి సత్యం కొడిమ్యాల మండలంలో గడప, గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో యశస్విని రెడ్డికి మద్దతుగా కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు ప్రచారం నిర్వహించారు.
యాదాద్రి జిల్లా భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె.. చేతి గుర్తుకు ఓటేయాలని ప్రచారం జరిపారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో జైవీర్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయి సమావేశం నిర్వహించారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్ టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తుమ్మల నాగేశ్వరరావును సన్మానించిన టీడీపీ శ్రేణులు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం
Election Campaign in Telangana 2023 : రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. మిర్యాలగూడ అభ్యర్థి సాధినేని శ్రీనివాస రావుకు మద్దతుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శోభాకరన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ టీ షాపులో స్వయంగా ఛాయ్ తయారు చేయటంతో పాటు దుకాణాలన్నింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు.
కోరుట్ల నియోజకవర్గంలోని ఐలాపూర్, కల్లూరులో ఎంపీ అర్వింద్ ఓట్లు అభ్యర్థించారు. నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులు మోహన్ రెడ్డి, దినేశ్ కులాచారి డబుల్ ఇంజిన్ సర్కార్‌కు మద్దతివ్వాలని కోరారు. హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో డాక్టర్ ప్రసాద్, ఆయన కుమార్తె యశస్వి బీజేపీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు - ఒకేరోజు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం
కాంగ్రెస్ మన ఓటుతో మన కళ్లల్లోనే పొడిపించాలని చూస్తోంది: కేసీఆర్