ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు.. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు విపక్షాలు సిద్ధం

Congress Issues Discussion Assembly: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎంలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు, ప్రభుత్వం నుంచి పరిష్కారాలు రాబట్టేందుకు వ్యూహా, ప్రతివ్యుహాలతో విపక్షాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల హామీల అమలు, నిరుద్యోగం, ధరణి, ధరల పెరుగుదల సహా వివిధ అంశాలను ప్రస్తావించేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు.

Congress Issues Discussion Assembly
Congress Issues Discussion Assembly
author img

By

Published : Feb 3, 2023, 7:51 AM IST

Updated : Feb 3, 2023, 8:33 AM IST

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు.. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు విపక్షాలు సిద్ధం

Congress Issues Discussion Assembly: ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను శాసనసభ వేదికగా ప్రస్తావించనున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎన్నికల హామీల అమలుకు పట్టుబడతామన్న ఆయన రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి అన్ని అంశాలను సమావేశాల్లో లేవనెత్తనున్నట్లు తెలిపారు.

State Legislature Budget Sessions 2023: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. షాదీముబారక్‌కు అధిక నిధులు, పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం, ఇమామ్‌లకు గౌరవవేతన బకాయిలు, పాతనగరం అభివృద్ధి, మెట్రో విస్తరణ తదితర అంశాలపై సభలో చర్చకు పట్టుపట్టేందుకు ఎంఐఎం సిద్ధమవుతోంది. వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు, ధరణి, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి 317 జీవో అమలుతో ఇబ్బందులు సహా అన్ని ప్రజాసమస్యలు సభలో ప్రస్తావించనున్నట్లు బీజేపీ వెల్లడించింది.

BJP Revealed That Public Issues Will Be Mentioned: పోడు భూముల సమస్య, సొంత జాగా ఉన్నవారికి ఆర్థిక సాయం తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కోసం ప్రయత్నిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాలను కనీసం నెలరోజులైనా నిర్వహించాలని బీఏసీలో కోరతామని విపక్ష నేతలు ప్రకటించారు. ప్రజాసమస్యల ప్రాధాన్యం, చర్చకు అవకాశం కల్పించేలా నిర్వహించేందుకు పట్టుబడతామన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.