ETV Bharat / state

'పాలిటెక్నిక్​లో ఈ ఏడాది ఓపెన్ బుక్ ఎగ్జామ్' - పాలిటెక్నిక్​లో పుస్తకం చూసి పరీక్షరాసే విధానం

కరోనా సోకిన అభ్యర్థులకు ఆస్పత్రుల్లో పాలిసెట్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రేపటి పాలిసెట్​ను కరోనా జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆన్ లైన్ పరీక్షలకు కొంత ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ.. పలు సాంకేతిక కారణాల వల్ల పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదన్నారు. పాలిటెక్నిక్​లో వచ్చే సెమిస్టర్ నుంచి పుస్తకాలు చూస్తూ పరీక్ష రాసేలా.. ఓపెన్ బుక్ విధానాన్ని ప్రవేశ పెడతామంటున్న నవీన్ మిత్తల్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి నగేష్ చారి ముఖాముఖి...

Naveen Mithal
Naveen Mithal
author img

By

Published : Jul 16, 2021, 9:14 PM IST

సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్​తో ముఖాముఖి

పరీక్ష అంటే చాలా ప్రిపేర్ కావాలి. ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోవాలి. లేదంటే కనీసం బట్టీ పట్టితే కానీ పరీక్ష పాస్ కాలేము. అయితే ఈ విధానంలో కీలక మార్పులకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్య కోర్సుల్లో విషయాన్ని గుర్తుంచుకోవడం కన్నా... ఆ విషయాన్ని ప్రాక్టికల్​గా అమలు చేయడమే అవసరమని విద్యా శాఖ భావిస్తోంది. అందులో భాగంగా పుస్తకాలను చూసి పరీక్ష రాసేలా.. ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం అమలు చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. లా పూర్తి చేసిన తర్వాత న్యాయవాది వృత్తి ప్రాక్టీసు చేసేందుకు అవసరమైన ఆలిండియా బార్ ఎగ్జామ్ ప్రస్తుతం ఈ విధానంలోనే జరుగుతోంది. ఇలాంటి పద్ధతిని ఇంజినీరింగ్​తో పాటు డిగ్రీలోనూ కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ విధానం అమలు చేసేందుకు కొంతకాలంగా అధ్యయనం జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్ విధానం ప్రవేశపెట్టనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

ఆన్ లైన్ పరీక్షలతో కొన్ని సమస్యలు

ఆన్ లైన్​లో పరీక్షలు నిర్వహించేందుకు కొంత ప్రయత్నం జరుగుతున్నప్పటికీ... సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయి పరిణితిలో లేనందున కొంత ఆలోచించాల్సి వస్తోందన్నారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా ఉండటం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా కెమెరా ఆఫ్ అయిపోయినప్పుడు.. విద్యార్థులు కాపీయింగ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి విద్యార్థులపై చర్య తీసుకుంటే ఓ సమస్య.. తీసుకోకపోతే మరో సమస్య వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి పలు అంశాలపై అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ, కొన్ని అటానమస్ కళాశాలల్లో ఆన్ లైన్ పరీక్షలు జరుగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు.

ప్రత్యక్ష తరగతులకు తొందరలేదు

ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించే తొందర లేదని నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఇప్పట్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించే ఆలోచన లేదన్నారు.

పాలిటెక్నిక్ చదివిన వారు.. ఉద్యోగాలకే సిద్ధంగా ఉండాలి

పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారు ఇంజినీరింగ్​కు వెళ్లడం కన్నా.. ఉద్యోగాల కోసం పరిశ్రమలకు సిద్ధంగా ఉండాలని ఏఐసీటీఈ భావిస్తోందని నవీన్ మిత్తల్ తెలిపారు. ఒకవేళ ఇంజినీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్ ద్వారానే వెళ్లాలన్నది ఏఐసీటీఈ ఉద్దేశమన్నారు. అందుకే పాలిటెక్నిక్ చదివిన వారికి ఇంజినీరింగ్​లో గతంలో ఉన్న 20శాతం సీట్లను 10 శాతానికి తగ్గించిందన్నారు. పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలు షిఫ్టు విధానంలో నిర్వహించరాదని కూడా ఏఐసీటీఈ స్పష్టం చేసిందన్నారు. దానివల్ల పాలిటెక్నిక్ కాలేజీలు మూసేసేందుకు కొన్ని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు.

కరోనాతో ఉంటే.. ఆస్పత్రిలోనే పాలిసెట్

శనివారం పాలిసెట్ రాయాల్సిన విద్యార్థుల్లో ఎవరైనా కరోనా బారిన పడితే.. వారికి ఆస్పత్రిలోనే పరీక్ష నిర్వహిస్తామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. ఈ ఏడాది పాలిటెక్నిక్ తోపాటు వ్యవసాయ, వెటర్నరీ, బాసర ఆర్జీకేయూటీ సీట్లను కూడా పాలిసెట్ ర్యాంకుల ద్వారానే భర్తీ కానున్నాయి. వాటికి ఆయా నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక మెరిట్ జాబితాలను రూపొందిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇదీ చూడండి: RGUKT: పాలిసెట్‌ ద్వారా ఆర్‌జీయూకేటీ సీట్ల భర్తీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.