తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా భక్తులు పాల్గొనేందుకు తితిదే అవకాశం కల్పించింది. నవంబరు 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో కుంకుమార్చన టికెట్లు పొందిన భక్తులు తమ నివాస ప్రాంతాల నుంచి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం కల్పిస్తోంది. లక్ష కుంకుమార్చన టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు తితిదే ప్రకటించింది.
కుంకుమార్చన సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, రెండు పసుపుదారాలు, కలకండ ప్రసాదంగా తపాలా శాఖ ద్వారా అందజేయనున్నారు. ఆన్లైన్ టికెట్లను www.tirupatibalaji.ap.gov.in ద్వారా బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది.