ETV Bharat / state

మలిదశ పోరాటానికి ఆద్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ - ఈ నెల 27న ప్రభుత్వం అధికారికంగా  కొండా లక్ష్మణ్​ బాపూజీ వర్ధంతి నిర్వహణ

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ మలిదశ పోరాటానికి ఆద్యుడని బాపూజీ ఆశయ సాధన సమితి అధ్యక్షులు సురేష్ తెలిపారు. కొండా లక్ష్మణ్​ బాపూజీ 7వ వర్ధంతిని పురష్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ నెల 27న ప్రభుత్వం అధికారికంగా  కొండా లక్ష్మణ్​ బాపూజీ వర్ధంతి నిర్వహణ
author img

By

Published : Sep 21, 2019, 11:52 AM IST

ఈ నెల 27న ప్రభుత్వం అధికారికంగా కొండా లక్ష్మణ్​ బాపూజీ వర్ధంతి నిర్వహణ

స్వాతంత్య్ర సమర యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 7వ వర్ధంతిని కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన సమితి హైదరాబాద్​లో నిర్వహించింది. నారాయణగూడలోని పద్మశాలి భవన్ ముందున్న ఆయన విగ్రహానికి సమితి అధ్యక్షుడు దాసు సురేష్ బృందం పూలమాల వేసి నివాళులర్పించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి , తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యం అని తెలియజేసి మలిదశ పోరాటానికి బాపూజీ ఆధ్యుడయ్యాడని వారి పేర్కొన్నారు. ఈ నెల 27న ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆకాంక్ష సాకారం కావడానికి ఆధ్యుడైన బాపూజికి సరైన గౌరవం దక్కకపోవడం బాధాకరం అన్నారు. ట్యాంకుబండ్ పై ఆయన విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విస్తృతపరచాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: శత వసంతాన.. ఆ బామ్మకు పుట్టినరోజు వేడుక

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.