ETV Bharat / state

SUB REGISTRATION OFFICE: ఆ కార్యాలయాల్లో అంతా ధనమూలమిదం జగత్‌ - తెలంగాణ 2021 వార్తలు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. సక్రమమైనా... అక్రమమైనా ఆ కార్యాలయాల్లో అంతా ధనమూలమిదం జగత్‌. చాలాచోట్ల అదనంగా డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్‌ అయ్యే పరిస్థితి ఉంది. దస్తావేజు లేఖరులు లేనిదే పని జరగట్లేదు. మధ్యవర్తులు, లంచాల ప్రమేయం లేకుండా చేయాలని ప్రభుత్వం తెచ్చిన విధానం ఆచరణ సాధ్యం కాకపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది.

officials-taking-bribes-at-sub-registration-offices
ఆ కార్యాలయాల్లో... అంతా ధనమూలమిదం జగత్‌!
author img

By

Published : Aug 20, 2021, 6:38 AM IST

రాష్ట్రంలో అనధికారిక లేఅవుట్‌లు, అనుమతి లేని స్థలాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం సుమారు 10 నెలల కిందట నిలిపివేసింది. గత ఏడాది డిసెంబరు మూడో వారం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే కొందరు సబ్‌రిజిస్ట్రార్లు అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు తెరతీశారు. కొన్ని స్థలాలకు నేరుగానే రిజిస్ట్రేషన్లు చేసేశారు. మరికొన్ని కార్యాలయాల పరిధిలో పునాదులు కూడా లేని స్థలాలకు వాటి యజమానులు ఇంటి నంబర్లు తెచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాల్లో నకిలీ ఇంటి నంబర్లతో వేల సంఖ్యలో ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్వీయధ్రువీకరణ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటి నంబర్లు పొందే విధానాన్ని ఖాళీ స్థలాలకు ఉపయోగించుకున్నారు. యజమానులు, దస్తావేజు లేఖరులు, రిజిస్ట్రేషన్‌ సిబ్బంది కుమ్మక్కవడంతో ఇవి యథేచ్ఛగా సాగిపోయాయి.

బయటపడే అక్రమాలు కొన్నే...

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో అనుమతి లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వ్యవసాయభూమిని వ్యవసాయేతరభూమిగా ముగ్గురికి రిజిస్ట్రేషన్‌ చేసిన ఘటనలో మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెండయ్యారు. మందమర్రి మండలం తిమ్మాపూర్‌ శివారులో 847 గజాల భూమిని లేఔట్‌ నిబంధనలను ఉల్లంఘించి మూడు ప్లాట్లుగా విభజించి రిజిస్ట్రేషన్‌ చేయడంతో ఆయనపై వేటు పడింది.

నోట్లకు పడగెత్తిన అధికారి

గత నెల 29న ఏసీబీకి పట్టుబడిన యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ నివాసంలో తనిఖీలు చేయగా రూ. 76 లక్షల నగదు లభించింది. బంగారం, ఇతర ఆస్తులను కూడా గుర్తించారు. యాదగిరిగుట్టలో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన దస్తావేజులను ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్‌ పట్టుబడ్డారు. ఆయనతో పాటు, దస్తావేజు లేఖరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

మళ్లీ పాతవిధానమే

రిజిస్ట్రేషన్‌ విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం అమల్లో ఇబ్బందుల నేపథ్యంలో పాత విధానాన్నే కొనసాగిస్తోంది. వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే వారు నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. నిర్ణీత ఛార్జీలు చెల్లించి నిర్దేశించుకున్న సమయానికి వెళ్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవ్వాలి. ఈ విధానాన్ని గత ఏడాది డిసెంబరు 14న ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దస్తావేజు లేఖరుల ప్రమేయాన్ని నివారించేలా దీన్ని ప్రవేశపెట్టారు. కానీ అమల్లో ఇబ్బందుల కారణంగా వారం రోజులకే ఇది అటకెక్కింది. డిసెంబరు 21 నుంచి మళ్లీ పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి.

దస్తావేజు లేఖరులదే హవా..

దళారులు, దస్తావేజు లేఖరుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలుదారులే రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. నమూనా దస్తావేజులు, ఎంత ఫీజు చెల్లించాలి? రిజిస్ట్రేషన్‌కు ఏయే పత్రాలను తీసుకురావాలి వంటి అంశాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇలా నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు అతి తక్కువగా ఉంటున్నారు. దస్తావేజులు రాసుకోవడం, అనుబంధ డాక్యుమెంట్లను సమకూర్చుకోవడం, ఛార్జీల మొత్తాన్ని లెక్కించడం, చెల్లించడం, స్లాట్‌ బుక్‌ చేయడం వంటి అన్ని పనులకు దస్తావేజు లేఖరులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వారి ద్వారా లంచాలు అధికారుల వరకు చేతులు మారుతున్నాయి. ఇలా వచ్చిన కక్షిదారులకే సిబ్బంది ప్రాధాన్యమిస్తున్నారు.

ఒక్క రోజు ఇన్‌ఛార్జి... 32 అక్రమ రిజిస్ట్రేషన్లు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సబ్‌రిజిస్ట్రార్‌ ఒక రోజు సెలవు పెట్టారు. ఆ రోజు సీనియర్‌ అసిస్టెంట్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ ఒక్కరోజులోనే 32 అనధికారిక ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేశారు. దీంతో ఉన్నతాధికారులు సీనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారు.

ఇదీ చూడండి: Gandhi Hospital Rape: గాంధీ ఘటనపై వీడిన మిస్టరీ.. అక్కాచెల్లెల్లపై ఆత్యాచారం కల్పితమే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.