ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయిలోనే లక్ష్యాలను ఎంచుకోవాలని... సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓక్ ఇంటర్‌నేషనల్ పాఠశాల పదో వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు పాఠశాలకు, దేశానికి గుర్తింపు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లక్ష్మీనారాయణ బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి: వంద శాతం అక్షరాస్యతే ధ్యేయం: కేసీఆర్