ETV Bharat / state

ఓటుకు నోటు కేసు.. విచారణ ఈ నెల 15కు వాయిదా - రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణ తాజా వార్తలు

ఓటుకు నోటు కేసు విచారణను నెల రోజులు వాయిదా వేయాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్​పై నిర్ణయాన్ని... అనిశా న్యాయస్థానం ఈ నెల 15 తేదికి వాయిదా వేసింది. కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసేందుకే ఆయన రకరకాల పిటిషన్లు వేస్తున్నారని అనిశా ఆరోపించింది.

Note case for vote .. Adjournment hearing till 15th of this month
ఓటుకు నోటు కేసు.. ఈ నెల 15 కి విచారణ వాయిదా
author img

By

Published : Mar 10, 2021, 4:40 PM IST

పార్లమెంట్​ సమావేశాలు ఉన్నందున ఓటుకు నోటు కేసు విచారణను నెల రోజులు వాయిదా వేయాలన్న ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్​పై అనిశా న్యాయస్థానం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్సిన అవసరం ఉందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు వాదనలు వినిపించారు.

కేసు విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసేందుకే రేవంత్​ రెడ్డి రకరకాల పిటిషన్లు వేస్తున్నారని అనిశా ఆరోపించింది. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ సింహా నేడు కోర్టు విచారణకు హాజరయ్యారు.

ఇదీ చదవండి: సాగు చట్టాలు, చమురు ధరలపై దద్దరిల్లిన పార్లమెంట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.