ETV Bharat / state

ఆసుపత్రుల్లో చికిత్సకు నిరాకరణ... ఆగుతున్న గుండెలు - హైదరాబాద్​ ఆసుపత్రుల్లో సమస్యలు

కొవిడ్‌ లక్షణాలున్నా, లేకున్నా అనారోగ్యాలతో బాధపడుతూ ఆసుపత్రులకు వస్తున్న వారిని వివిధ కారణాలు చూపుతూ చేర్చుకోవడానికి నిరాకరిస్తుండడంతో అలాంటి వారి గుండెలు ఆగిపోతున్నాయి. కుటుంబ సభ్యులను ఈ పరిణామాలు తీవ్ర ఆవేదనకు గుర్తిచేస్తున్నాయి. ఇలాంటి రెండు ఘటనలు ఒకే రోజు వెలుగుచూశాయి.

no-vacancy-in-hyderabad-hospitals
ఖాళీల్లేవంటున్న వైద్యశాలలు... ఆగిన రెండు గుండెలు..
author img

By

Published : Jun 27, 2020, 9:44 AM IST

హైదరాబాద్​ ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి(60) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఆయన ఇద్దరు పిల్లలు గురువారం రాత్రి నుంచి 4 గంటలపాటు ఐదు కార్పొరేట్‌ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. స్పందించకపోవడంతో చివరకు నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. అయిదింటిలో ఏ ఒక్క ఆసుపత్రి స్పందించినా తమ తండ్రి దక్కేవారిని వారు వాపోయారు.

సకాలంలో స్పందించక మహిళ కన్నుమూత

ఆస్తమాతో బాధపడుతున్న దమ్మాయిగూడకు చెందిన సత్తెమ్మదీ ఇలాంటి పరిస్థితే. భర్త చనిపోయారు. ఈమెకు ముగ్గురు పిల్లలు. ఆమె శ్వాస సంబంధిత సమస్యతో సతమతమవుతుండడంతో అల్లుళ్లు ప్రైవేటు అంబులెన్స్‌లో తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొవిడ్‌ లక్షణాలున్నాయని గాంధీ ఆసుపత్రికి పంపించారు. కరోనా పరీక్షలు చేయించుకొని రావాలంటూ వారు ఛాతీ ఆసుపత్రికి పంపారు. ఛాతీ ఆసుపత్రిలో పడకలు లేవని చెప్పడంతో మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించారు. వారూ అదే సమాధానం ఇవ్వడంతో కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా అనుమానితుల తాకిడి నేపథ్యంలో వైద్యులను సంప్రదించడం సాధ్యపడలేదు. ఈలోగా అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అయిపోవడంతో ఆమె కిందపడిపోయింది. ఈ విషయం మీడియా ఛానళ్లలో రావడంతో ఆసుపత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆమె ఆంబులెన్స్‌లో ఉందని గుర్తించిన కింగ్‌కోఠి ఆసుపత్రి వైద్యాధికారి మల్లికార్జున్‌.. అంబులెన్స్‌ సిబ్బందిని మందలించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఐసీయూలో చేర్చుకొని చికిత్సను ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూసింది.

చనిపోయారండీ.. సారీ

ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తండ్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో తన సోదరిని పిలిపించాడు. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేర్చుకున్న కొద్దిసేపటికి మా వద్ద వెంటిలేటర్లు లేవని వేరే ఆసుపత్రికి వెళ్లండంటూ డిశ్చార్జి చేశారు. సోమాజిగూడలోని మరో కార్పొరేట్‌ ఆసుపత్రికి గురువారం అర్ధరాత్రి 12.10 గంటలకు తీసుకెళ్లారు. పడకలు లేవని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పినా వినలేదు. సికింద్రాబాద్‌లోని మరో కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లగా... శుక్రవారం ఉదయం చేర్చుకుంటామన్నారు. సైఫాబాద్‌లోని మరో కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లగా అరవై ఏళ్లు దాటిన వారిని చేర్చుకోమని సిబ్బంది స్పష్టం చేశారు. అమీర్‌పేట్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లగా... కరోనా నిర్ధారణ పరీక్షలు చేశాకే వైద్యం చేస్తామని, ఉదయం రావాలన్నారు. దీంతో నిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగానికి వెళ్లి పరిస్థితిని వివరించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. చేర్చుకొనేందుకు సరేననడంతో వారే వైద్యుల చెంతకు తరలించారు. నాడిపట్టిన వైద్యులు చనిపోయారండి.. సారీ అంటూ చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు.

ఇదీ చదవండి: జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.