ఏపీలోని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొంతమంది అడ్డుకుంటూన్నారనే అనే ఉద్ధేశంతో అమరావతి ఎమ్మార్పీఎస్ నేతలు మందడం నుంచి సచివాలయం వరకు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీనికి వ్యతిరేకంగా అమరావతి దళిత ఐకాస నేతలు ర్యాలీ చేయాలని నిర్ణయించారు.
పోలీసులు తుళ్లూరు మండలం వెంకటపాలెం, మందడం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. మరోవైపు అమరావతి ఎమ్మార్పీఎస్ నేతలను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: కరోనా కంటే.. భయంతోనే ఎక్కువ మరణాలు : మంత్రి ఈటల