హైకోర్టును ఆశ్రయించనున్న నిజామాబాద్ రైతులు నిజామాబాద్ లోక్సభ రైతు అభ్యర్థులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తాము పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ ఇవాళ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఎన్నికల సంఘం తమకు కేటాయించిన గుర్తులు ఎలా ఉంటాయో చెప్పలేదని.. వాటిపై ప్రచారం చేసుకోవడానికి సమయం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసీ తీరుకు నిరసనగా ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై హైదరాబాద్లో ఓ న్యాయవాదిని సంప్రదించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి :'మాకు ఈవీఎంలు వద్దు..బ్యాలెట్ పేపర్లే కావాలి'