ETV Bharat / state

'అడిగిందేమో మేం.. ఇచ్చిందిమో వాళ్లకి'.. నిజాం కళాశాలలో విద్యార్థుల నిరసన

Nizam College Students Protest: హైదరాబాద్​లోని నిజాం కళాశాలలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు వసతి గృహం కేటాయించాలంటూ ప్రిన్సిపల్ ఛాంబర్‌ ఎదుట విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

Nizam College Students protest at hyderabad

author img

By

Published : Nov 5, 2022, 2:14 PM IST

Updated : Nov 5, 2022, 2:29 PM IST

Nizam College Students Protest: హైదరాబాద్ బషీర్​బాగ్​లోని నిజాం కళాశాలలో ప్రిన్సిపల్​ ఛాంబర్ కార్యాలయంలో విద్యార్థుల బైఠాయింపు ఉద్రిక్తంగా మారింది. నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్‌ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థినులు ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

అయిదు రోజులు సమయం ఇవ్వాలని చెప్పిన ప్రిన్సిపల్​.. దొంగచాటుగా పీజీ విద్యార్థినులకు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రిన్సిపల్​ కార్యాలయంలో బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు హాస్టల్ వసతి కేటాయించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అక్రమ అరెస్టు​లకు భయపడే ప్రసక్తే లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.

'అడిగిందేమో మేం.. ఇచ్చిందిమో వాళ్లకి'.. నిజాం కళాశాలలో విద్యార్థుల నిరసన

ఇవీ చదవండి: కమాండ్ కంట్రోల్ కేంద్రం ముట్టడికి భాజపా యత్నం.. అడ్డుకున్న పోలీసులు

భూ వివాదంలో చిక్కుకున్న శివపార్వతులు.. నోటీసులు జారీ!

Last Updated : Nov 5, 2022, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.