Nirmala Sitharaman on Digitization: దేశం ఆర్థికంగా ఎదగడానికి డిజిటలైజేషన్, ఆవిష్కరణ, వ్యవస్థాకత అనేవి మూడు స్తంభాలుగా వ్యవహరిస్తాయి అనే అంశంపై ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఎన్‌ఐఎఫ్‌టీ, ఎన్‌ఐడీ, ఎఫ్‌డీడీఐ, ఐఐఎఫ్‌టీ విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. వచ్చే 25 ఏళ్ల కాలపరిమితిలో మన దేశ సంస్కృతిని, సంప్రదాయలను విస్తరించి.. దేశంలో ఉన్న బ్రిటీష్ కాలపు గుర్తులను తుడిచి పారేయాలని పేర్కొన్నారు. మన దేశ ఉత్పత్తులను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఆవిష్కరణ, వ్యవస్థాపకత, డిజిటలైజేషన్ లేకపోతే దేశం ఈ రోజు ఇంత ఎదిగి ఉండేది కాదని పేర్కొన్నారు. ఈ తరం యువత కూడా వ్యవస్థాపకులుగా ముందుకు రావటానికి మొగ్గు చూపుతున్నారు.. అది దేశానికి మంచి విశేషమని వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని.. మంత్రులిద్దరినీ ఆయా రంగాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు.
ఇవీ చదవండి: