ETV Bharat / state

రేవంత్​ లేఖకు నిరంజన్​రెడ్డి కౌంటర్​.. కేంద్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా అంటూ..!

Niranjan Reddy Counter to Revanth Reddy : పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​కు రాసిన లేఖపై మంత్రి నిరంజన్​రెడ్డి కౌంటర్​ వేశారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం రాష్ట్రాల పరిధిలోకి రాదని.. కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరను నిర్ణయిస్తుందని తెలిపారు. స్వామినాథన్ కమిషన్​ సిఫార్సులను అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.

నిరంజన్​రెడ్డి
నిరంజన్​రెడ్డి
author img

By

Published : Dec 31, 2022, 10:45 PM IST

Niranjan Reddy Counter to Revanth Reddy : పత్తి గిట్టుబాటు ధరపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాయడమేంటని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. పత్తి గిట్టుబాటు ధర రాష్ట్రం పరిధిలోని అంశమా, కేంద్రం పరిధిలోనిదా అని రేవంత్‌ను నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మాట తప్పిన ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్‌ ఎంపీగా ఎప్పుడైనా నిలదీశారా అని రేవంత్‌ను ప్రశ్నించారు.

ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని.. రేవంత్ రెడ్డి సూచనలు, సలహాలు అవసరం లేదని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.17,351 కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు వివరించారు. పది విడతల్లో రైతుబంధు కింద.. రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఏటా రూ.10,500 కోట్ల వ్యయంతో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్టు నిరంజన్‌రెడ్డి వివరించారు.

రైతు బీమా ద్వారా.. 95,107 కుటుంబాలకు రూ.4,755 కోట్ల పరిహారం అందించామని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తరహా వ్యవసాయ పథకాలు, విధానాలు దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.