నిమ్స్ ఆసుపత్రిలో యూవీ పరికరం ఒక్కసారిగా పేలింది. డయాలసిస్ కేంద్రం పక్కనే ఉన్న గదిలో ఈ పరికరం ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దం రావడంతో రోగుల సహయకులు కొందరు రోగులు సిబ్బంది ఆందోళనతో పరుగులు తీశారు. ఏమి జరిగిందో అర్థంకాక అయోమయానికి గురయ్యారు.
నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి వెళ్లి పరిశీలించగా యూవీ పరికరం పేలినట్లు గుర్తించారు. స్వల్పంగా మంటలు రావడంతో మంటలను అదుపు చేశారు. పరికరం పేలిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తృటిలో తప్పింది. పేలుడు గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పేలుడు సంభవించిందని, పరికరం అధిక వేడి కారణంగానే పేలిపోయిందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. పేలుడు ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఆరా తీస్తోంది.
ఇదీ చూడండి : ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య