ETV Bharat / state

మానవ అక్రమ రవాణాపై ఎన్​ఐఏ కేసు నమోదు

ఏప్రిల్​లో హైదరాబాద్​లో ఛత్రినాక పోలీసులకు వ్యభిచారం కేసులో బంగ్లాదేశ్​కు చెందిన యువతులు పట్టుబడ్డారు. ఈ విషయమై జాతీయ దర్యాప్తు సంస్థ మానవ అక్రమ రవాణాపై హైదరాబాద్​లో కేసు నమోదు చేసింది.

మానవ అక్రమ రవాణాపై ఎన్​ఐఏ కేసు నమోదు
author img

By

Published : Sep 18, 2019, 7:57 PM IST

మనుషుల అక్రమ రవాణాపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) తొలిసారి హైదరాబాద్​లో కేసు నమోదు చేసింది. ఏప్రిల్​లో హైదరాబాద్ ఛత్రినాక పోలీసులు కందికల్ గేట్ బాజీనగర్​లో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని అరెస్టు చేశారు. వీరు బంగ్లాదేశ్​కు చెందిన యువతులను వ్యభిచార రొంపిలోకి దింపి ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురు మహిళలకు పోలీసులు విముక్తి కల్పించారు. అనంతరం ఈ కేసు సీసీఎస్​కు బదిలీ చేశారు. బంగ్లాదేశ్​కు చెందిన యువతులు పట్టుబడినందున.. ఎన్​ఐఏ ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేసిందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిః అంతర్జాలంలో హైటెక్ వ్యభిచారానికి అడ్డుకట్ట వేస్తాం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.