దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం మరోసారి పరిశీలించనుంది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరును పోలీసులు వివరించనున్నారు. తొలిరోజు మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో నిందితుల మృతదేహాలు, చటాన్ పల్లి వద్ద ఘటనా స్థలాలను కమిషన్ సభ్యులు పరిశీలించారు.
నిందితుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఎన్‌హెచ్‌ఆర్సీ సేకరించనుంది. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల నుంచి కుటుంబసభ్యులను పోలీసులు ఇప్పటికే హైదరాబాద్‌కు తరలించారు.
ఇదీ చూడండి: ఎన్‌కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం