ETV Bharat / state

నూతన సంవత్సరం... నూతన లక్ష్యాలు

author img

By

Published : Jan 1, 2020, 5:59 AM IST

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. డైరీలు.. క్యాలెండర్ల పేజీలు.. మారడం మాత్రమే కాదు. నూతన సంవత్సరం అంటే కొత్తగా ఆలోచించడం.. కొత్త ప్రణాళికలు, కొత్త పనులు ప్రారంభించడం ఇలాంటివి అనేకం ఉంటాయి. మరి దానికి యువత ఈ సంవత్సరం చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం.

NEW YEAR 2020 NEW GOALS
నూతన సంవత్సరం... నూతన లక్ష్యాలు

కొత్త సంవత్సరం... ఇంకేముందీ కొత్త జిందగీని స్టార్ట్​ చేద్దాం అనుకుంటారు. ఒకటి రెండ్రోజులు బాగానే ప్రయత్నం చేస్తాం... కానీ కొద్దిరోజులకు ఆచరణలో వైఫల్యం చెందుతాం. ఈ ఏడాది యువత చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం.

వ్యక్తిగత క్రమశిక్షణ:

యువత ఈ సంవత్సరం కచ్చితంగా తాము ఎలా ఉంటున్నామో గ్రహించుకోవాలి. ప్రధానంగా కోపం తగ్గించుకోవడం, ఇతరులతో బాగా ఉండాలనే నిర్ణయాలు తీసుకోవాలి. మన నడవడికను బట్టే అవతలి వ్యక్తులు మనతో మెలుగుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

అనవసర ఖర్చులు:

ముఖ్యంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఒక వస్తువును కొంటున్నామంటే అది మనకు ఎంతవరకు అవసరమో గుర్తించాలి. డబ్బును పరిమితికి మించి వాడకూడదని గుర్తు పెట్టుకోవాలి.

చరవాణి వినియోగం:

ప్రస్తుతం యువత సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నారు. సెల్ఫీలు దిగడం, చాటింగ్​ ఇతర వాటికి ఎక్కువ సమయమిస్తున్నారు. ఫలితంగా సమయం వృథా అవుతోంది. వీటికి ఈ ఏడాది కాస్త దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి.

సామాజిక సేవా కార్యక్రమాలు:

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. వాటి వల్ల మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి చేస్తున్నామనే భావన మీకు ధైర్యాన్ని ఇస్తుంది.

వ్యాయామం చేయండి:

మన శరీరం ఫిట్​గా ఉంటే...మన ఆలోచనలు కూడా కరెక్ట్​గా ఉంటాయి. అందుకే ఈ సంవత్సరం నుంచి వ్యాయమం మొదలుపెట్టండి. ఫిట్​గా ఉండండి. ఆనందాన్ని పంచండి.

ఇదీ చూడండి: భారత​ తొలి సీడీఎస్​గా బిపిన్ ​రావత్ నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.