ETV Bharat / state

ఈ కొత్త సంవత్సరం.. కొంగొత్త కానుకిద్దాం!

కొత్త ఏడాది వచ్చేసింది.. కొత్త ఆశలు... కొత్త లక్ష్యాలు.. అంతేనా కొత్త సంవత్సరం మార్పునకు మెట్టు లాంటింది. అలాంటి ఈరోజున మీ సన్నిహితులకు చేరువయ్యేలా ఇవ్వాల్సిన బహుమతుల గురించి తెలుసుకుందాం.

new year 2020 gifts for your family and friends special story
ఈ కొత్త సంవత్సరం.. కొంగొత్త కానుకిద్దాం!
author img

By

Published : Jan 1, 2020, 5:46 AM IST

ఒక బహుమతి... ఇచ్చిన వారి ప్రేమను తెలియజేస్తుంది. దానిని చూసిన ప్రతిక్షణం మనకు వారిపై ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంది. మరి అలాంటి బహుమతులను ఈ కొత్త సంవత్సరం నాడు ఇచ్చి... ఇచ్చి ప్రేమను తెలుపుదాం.

డైరీ...

కొత్త ఏడాది అనగానే డైరీ గుర్తుకువస్తోంది. మీ స్నేహితులకు గానీ, మీ సన్నిహితులకు ఈ గిఫ్ట్​ ఇస్తే ఎంతో బాగుంటుంది. ఒకప్పుడు డైరీకి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు అఫీసుల్లో ఉద్యోగులకి ప్రతి సంవత్సరం చివర బహుమతులుగా ఇచ్చుకోవడానికే పరిమితమైంది. తమ భావాలను, అనుభూతులను, ప్రేమను, బాధను, సంతోషాన్ని, విచారాన్ని, విషాదాన్నీ... ఒకటేమిటీ, అన్నీ తనతో పంచుకోవచ్చు. ఇందరికీ ఓదార్పు అవుతోన్న డైరీ గొప్పదనం, అవసరం తెలీడంలేదు. అందుకే మీ సన్నిహితులకు డైరీని ఇచ్చి... మెప్పు పొందండి.

వాచ్​....

స్మార్ట్​ ఫోన్​ల సంఖ్య పెరిగాక వాచ్​ల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. కొంత మంది ఫ్యాషన్​ కోసం ధరిస్తుంటారు కానీ... అసలు అప్పట్లో గడియారం చేతికి ఉంటే ప్రతిక్షణాన్ని మనకు గుర్తుచేసేది. ఇప్పుడు మీ సన్నిహితులకు నూతన సంవత్సరం సందర్భంగా ఒక వాచ్​ను బహుమతిగా ఇవ్వండి. వారికి మీపై ప్రేమను ప్రతి క్షణం గుర్తుకు తెస్తుంది.

మొక్క...

న్యూఇయర్​కు​ సాధారణంగా చాలా మంది పూలను ఇస్తూ... శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కానీ... పూలు ఒకరోజులో వాడిపోతాయి... అదే ఒక మొక్కను ఇస్తే మీ అభిమానంలా ఎప్పుడు చిగురిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీ స్నేహితులకు ఒక మొక్కను గిఫ్ట్​గా ఇచ్చి... సంతోషాన్ని పంచుకోండి.

పుస్తకం...

ఒక మంచి పుస్తకం... ఎంతో మంది స్నేహితులతో సమానం అంటారు. అది మనకు ఎలా ఆలోచించాలి అని నేర్పిస్తుంది. ఒక గదిలో మీరు ఒంటిరిగా పుస్తకం చదువుతుంటే అందులోని పాత్రలు మీ చుట్టూ ఉన్నట్టే అనిపిస్తోంది. అలాంటి ఒక మంచి పుస్తకాన్ని మీ స్నేహితులకు గిఫ్ట్​గా ఇవ్వండి. అది ఎప్పటికి గుర్తుండి పోయేలా..!!

ట్రిప్

ఒక టూర్​ ఎన్నో జ్ఞాపకాలను మిగుల్చుతుంది. కొత్త ప్రదేశాలు... కొత్త సంవత్సరం... కొత్త మనుషులు... మరి మీకు నచ్చిన వ్యక్తులను కొత్త టూర్​కు తీసుకెళ్లండి. వారికి సంతోషాన్ని పంచండి.

ఈ కథనం చూడండి: హ్యాపీ న్యూయర్ అంటూ మదిని మైమరపించే పూల బొకేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.