ETV Bharat / state

రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. మళ్లీ పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. తాజాగా రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ 887 కొత్త కేసులు నమోదవగా... మరో నలుగురు కొవిడ్​ బారిన పడి మరణించారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 308,776‬కి చేరింది.

CORONA CASES
ఈ ఏడాదిలో ఇవే రికార్డుస్థాయి కరోనా కేసులు
author img

By

Published : Apr 1, 2021, 9:33 AM IST

రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1,907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 5,511కు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 887 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 308,776కి చేరింది. తాజాగా 337 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 301,564‬మంది కోలుకున్నారు.

తాజాగా నలుగురు బలి

మరో నలుగురు మహమ్మారి బలితీసుకోగా... మొత్తం మరణాలు 1671కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 5,511యాక్టివ్ కేసులు ఉండగా అందులో 2,166 మంది ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 201 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 59,297 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.

సుమారు 47 శాతం వారికే..

కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 47 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. మహమ్మారి సోకిన వారిలో ఇటీవల చాలా స్వల్పంగానే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కరోనా సిప్టమ్స్ ఉన్నా.. తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విన్నవిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.