సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని బయోపోర్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, నిట్ నడుమ నూతన ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా నిట్లో ఎమ్మెస్సీ, ఎంటెక్, పీహెచ్డీ చేసే విద్యార్థులు పరిశ్రమలో ఎక్స్పోజర్ సందర్శించవచ్చు. మరోవైపు పరిశ్రమలో పనిచేసే శాస్త్రవేత్తలు... నిట్ సైంటిస్టులతో కలిసి పరిశోధనలు జరపవచ్చు.
ఈ మేరకు నిట్ డైరెక్టర్ రామారావు, బయోపోర్ సంస్థ సీఈవో అధికారి జగదీశ్ బాబులు సంతకాలు చేసి అంగీకారం తెలిపారు. ఇరుసంస్థల అవసరాలకు తగ్గట్లు స్వల్పకాల కోర్సులు నిర్వహించడం, సదస్సులు, సింపోజియంలు, పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే సమావేశాలు నిర్వహిస్తారు. నిట్లో జరిగే ప్రాంగణ ఎంపికల్లో పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఒప్పందం ఐదేళ్లపాటు కొనసాగుతుందని వారు తెలిపారు.
ఇదీ చూడండి: దలాల్ స్ట్రీట్ ఢమాల్- సెన్సెక్స్ రికార్డు పతనం